ఎనిమిదేళ్ళకే అంత కష్టమేం వచ్చింది తల్లీ...
posted on Dec 2, 2014 9:35PM
బెంగుళూరులో మంగళవారం ఒక ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లు కూడా నిండని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. జీవితానికి, మరణానికి కూడా అర్థం తెలియని ఆ ఎనిమిదేళ్ళ బాలికకి ఏ కష్టం వచ్చిందోగానీ, తనకు ముక్తి కలిగించేది ఆత్మహత్యేనని భావించింది. టిమీద కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోవాళ్ళందరూ బయటకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాలిక ఈ అఘాయిత్యానికి పాల్పడింది. గత 20 రోజులుగా ఈ బాలిక స్కూలుకు కూడా వెళ్ళడం లేదు. చనిపోయే ముందు ఈ బాలిక తన చావుకు ఎవరూ కారణం కాదని, తనకే జీవితం మీద విరక్తి కలిగి చనిపోతున్నానని లేఖ రాసి చనిపోయింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలిక 20 రోజులుగా స్కూలుకు వెళ్ళడం లేదంటే అక్కడేమైనా జరిగి వుండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.