సానుభూతి కోసం చూస్తున్న బాబు.. చట్ట వ్యతిరేక పాలన చేస్తున్న జగన్.. సుజనా ఫైర్

 

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని జగన్ ప్రభుత్వం పడగొడితే ప్రజల్లో సానుభూతి వస్తుందని బాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు. అద్దెకు ఉన్నప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేయొచ్చు కదా? అని చంద్రబాబును సుజనా ప్రశ్నించారు. అలాగే పొద్దున లేస్తే వైసిపి నేతలు 24 గంటలు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని అసలు ప్రభుత్వం మొత్తం కలిసి ఆ ఇంటి పై రాజకీయం ఏంటని అయన ప్రశ్నించారు. అలాగే తనకు అమరావతిలో భూములు ఉన్నాయని ఇష్టానుసారం ఆరోపణలు చేసి రుజువు చేయకుండా జారుకుంటున్నారని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

జగన్ ప్రభుత్వం 3 లక్షల ఉద్యొగాలు ఇచ్చామని చెప్పుకుంటోంది, కానీ అందులో 90 శాతం ఉద్యోగాలు మా పార్టీ కార్యకర్తలకే అన్న విజయ్ సాయి రెడ్డి వీడియో లీకేజి తో మనం అసలు ప్రజాస్వామయంలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతోందని సుజనా ఆందోళన వ్యక్తం చేసారు. ఆంటే పార్టీల పరంగా, కులాలు, మతాల పరంగా విడదీసి పరిపాలిద్దామనుకుంటున్నారా అని ఏపీ సర్కార్ పై మండిపడ్డారు. అలాగే 782 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ లో రివర్స్ టెండర్ల ద్వారా ఆదా చేశామని చెపుతున్నారు కానీ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం వల్ల 7500 కోట్లు నష్టం వస్తోందని సుజనా విమర్శించారు. దీనిపై జగన్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని అయన డిమాండ్ చేశారు. అసలు రివర్స్ టెండరింగ్ లో ఒకరే టెండర్ వేయడమేమిటని అయన ప్రశ్నించారు. అలాగే కొత్తగా తెచ్చిన ఇసుక పాలసీ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారని అయన ఎపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొత్తానికి సస్యశ్యామలంగా ఉండే ఏపీలో చట్ట వ్యతిరేక పాలన సాగుతోందని అయన విమర్శించారు.