అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా.. అయితే ఇదే మీ సమస్య కావచ్చు!

 

ఎప్పుడూ అలసటగా, బలహీనంగా ఉంటున్నారా??, కాళ్లూ చేతులూ జలదరిస్తున్నట్లు అనిపిస్తున్నాయా?  కండరాలు బలహీనపడుతున్నాయా? నడవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం మీ నుండి వస్తే, మీ శరీరంలో విటమిన్-బి లోపం ఉందని అర్థం. ప్రోటీన్, విటమిన్ సి, కాల్షియం  వంటి ఇతర పోషకాల మాదిరిగానే, శరీరానికి మెరుగైన పనితీరు కోసం బి విటమిన్లు కూడా అవసరం. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చేలా పనిచేస్తుంది. అందుకే విటమిన్ బి లక్షణాలు, దాని ప్రాధాన్యత, దాని వనరులు, మొదలైన విషయాలు  తెలుసుకుంటే..

విటమిన్ బి లోపం లక్షణాలు..

B విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అలసట, బలహీనత, శక్తి లేకపోవడం, చేతులు కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు, బలహీనమైన కండరాలు ఉంటాయి. నడవడంలో ఇబ్బంది, స్టేబుల్ గా ఉండలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.  దీని లోపం కారణంగా  బెరిబెరి, పెల్లాగ్రా లేదా రక్తహీనత వంటి వ్యాధులతో సహా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇవి కాకుండా, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, డిప్రెషన్, డిమెన్షియా వంటి సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

విటమిన్ B అనేది 8 రకాల విటమిన్ల సమూహం. పెద్దవారిలో ఈ కింద పేర్కొనబడిన మోతాదులో విటమిన్ బి అవసరం అవుతుంది..

1.1-1.2mg థియామిన్ (B1)

1.1-1.6mg రిబోఫ్లావిన్ (B2)

14-16mg నియాసిన్ (B3)

4-6mg పాంతోతేనిక్ యాసిడ్ (B5)

1.3-1.7mg పిరిడాక్సిన్ (B6)

25–30µg (మైక్రోగ్రాములు) బయోటిన్ (B7)

400µg (μg) ఫోలేట్ (B9)

2.4 mcg సైనోకోబాలమిన్ (B12)

చాలా మంది విటమిన్ బి గుడ్లు, చికెన్, మాంసం లేదా చేపలు వంటి నాన్-వెజ్ ఆహారాల్లో మాత్రమే లభిస్తుందని అనుకుంటారు, కానీ ఇది తప్పు. వాస్తవానికి, ఈ పోషకంతో నిండిన అనేక శాఖాహార ఆహారాలు ఉన్నాయి.

అనేక ఆకుపచ్చ ఆకు కూరలలో  ఫోలేట్ (B9) ఉంటుంది. బచ్చలికూర, ఆకుకూరలు వంటి వాటిలో బి విటమిన్ 39 శాతం వరకు ఉంటుంది. అయితే వీటిని లైట్ గా ఆవిరి చేయాలి తప్ప ఎక్కువ ఉడికించకూడదు. పోషకాలు నాశనం అవుతాయి. 

ఒక కప్పు (240 ml) పాలు రోజువారీ అవసరాలలో 26% రిబోఫ్లావిన్‌తో పాటు ఇతర B విటమిన్‌లను అందిస్తాయి. పాలు ఇతర పాల ఉత్పత్తులు B విటమిన్లకు మంచి మూలం.

చిక్‌పీస్.. వీటినే  నల్ల శనగలు అంటారు.  అలాగే పచ్చి బఠానీలు వంటి చిక్కుళ్ళు ఫోలేట్‌తో నిండి ఉంటాయి. వీటిలో థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, పాంతోతేనిక్ యాసిడ్, B6 వంటి ఇతర B విటమిన్‌లు  కూడా ఉంటాయి. 

పెరుగులో రిబోఫ్లేవిన్, బి12 పుష్కలంగా ఉంటాయి. 163 గ్రాముల పెరుగు రోజువారీ అవసరాలలో 18% B2 మరియు 26% B12ని అందిస్తుంది. ఇది కాకుండా, క్యాల్షియం, ప్రోటీన్ కూడా పెరుగులో పుష్కలంగా లభిస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలలో పాంతోతేనిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది.  1 ఔన్స్ (28 గ్రాముల) విత్తనాలలో  40% పాంతోతేనిక్ ఆమ్లాన్ని అందించగలవు. ఇది కాకుండా, నియాసిన్, ఫోలేట్ B6  కూడా వీటిలో ఉంటాయి. 

కాబట్టి కేవలం మాంసాహరంలోనే ఈ విటమిన్లు లభిస్తాయని అనుకోకుండా శాఖాహారులు కూడా పైన చెప్పుకున్న పదార్థాల ద్వారా వీటిని పుష్కలంగా పొందచ్చు.

                                     ◆నిశ్శబ్ద.