మధుమేహం, కీళ్ల వాతం ఉన్నవారిలో ఈ లక్షణాలుంటే కొంప మునిగినట్టే!

ఇప్పటి కాలంలో చాలామందిని వేధించే సమస్య ఏదైనా ఉందంటే.. అది మధుమేహం, కీళ్ల వాతం అని చెప్పచ్చు. ఈ రెండింటికి ప్రధాన కారణం అధికబరువు. అదిక బరువు ఉన్నవారిలో మధుమేహం రావడానికి అవకాశాలు ఎక్కువ. ఈ అధిక బరువే.. కీళ్లు అరిగిపోవడానికి కూడా కారణం అవుతుంది. కానీ మధుమేహం, కీళ్ల వాతం   మూత్రపిండాలను ఎంత నాశనం చెయ్యాలో అంతా చేస్తాయి. ఈ సమస్యను కనుగొనడానికి దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. 

మూత్రపిండాల వ్యాధుల లక్షణాలు

మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పేరుకుపోవడం లేదా ఎలక్ట్రోలైట్ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రకమైన పరిస్థితిలో, అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 

మూత్రపిండాల వ్యాధి లక్షణాలు..

వికారం వాంతులు, ఆకలి నష్టం, అలసట మరియు బలహీనత, నిద్ర సమస్యలు
తరచుగా లేదా అరుదుగా మూత్రవిసర్జన, కండరాల తిమ్మిరి ఇవన్నీ కొన్నిసార్లు కనబడుతూ ఉంటాయి. కానీ మూత్రపిండాల సమస్యలో ఇవి అధికం. మరీ ముఖ్యంగా కేవలం రెండు సమస్యలు చాలా అధికంగా కనబడతాయి.

సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం..

తరచుగా మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తుందా? ఈ సమస్య మూత్రపిండాలు, మధుమేహం రెండు వ్యాధులలో సంభవించవచ్చు. అయితే, ముఖ్యంగా రాత్రిపూట ఇటువంటి సమస్య ఏర్పడటం కిడ్నీ వ్యాధికి సంకేతంగా పరిగణించబడుతుంది. మూత్రపిండాల ఫిల్టర్లు క్షీణించడం ప్రారంభించినప్పుడు, ఇది మూత్ర విసర్జన చేయాలనే కోరికను పెంచుతుంది. కొన్నిసార్లు ఇది పురుషులలో యూరినరీ ఇన్ఫెక్షన్ లేదా ప్రోస్టేట్  విస్తరించడానికి సంకేతం కూడా కావచ్చు.

చీలమండలు, పాదాలలో వాపులు

పాదాలలో వాపు సమస్య కీళ్ళనొప్పుల వల్ల కూడా కావచ్చు, కానీ కిడ్నీ వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. చీలమండలు పాదాలలో వాపు, మూత్రపిండాల సమస్యలు, ముఖ్యంగా మూత్రపిండాల పనితీరు స్తంబించడం  వలన సంభవించవచ్చు. దిగువ కాళ్ళలో వాపు గుండె జబ్బులు, కాలేయ వ్యాధి, కాళ్ళ నరాల సమస్యలకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సమస్యలకు సకాలంలో వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం.

                                  ◆నిశ్శబ్ద.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News