రజనీ ఓ 420.. రజనీపై అంత అక్కసు ఎందుకు స్వామి....!
posted on Jul 6, 2017 5:05PM

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరోసారి విరుచుకుపడ్డారు. రజనీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తున్నారు అన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయో అప్పటినుండి స్వామిగారు రజనీని టార్గెట్ చేశారు. రజనీ సీఎం కాలేడు.. అసలు రజనీ కాంత్ కు రాజకీయాల్లోకి వచ్చే అర్హత లేదని విమర్శలు గుప్పించారు. ఆ తరువాత కూడా ఆయనకు సమయం చిక్కినప్పుడల్లా రజనీపై కామెంట్లు విసురుతూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి తాజాగా స్వామి రజనీకాంత్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం రజనీ కాంత్ అమెరికాలో ఉన్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రజనీ అమెరికాలోని ఓ కాసినోలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న ఫొటోను స్వామి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. అతనో 420 అంటూ కామెంట్ చేశాడు. తన ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడం కోసం ఆర్కే 420 గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడా? అతనికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఈడీ విచారణ జరపాలి అని స్వామి డిమాండ్ చేశారు. మరి రజనీ అంటే స్వామిగారికి అంత అక్కసు ఎందుకో ఆయనకే తెలియాలి.
.jpg)