వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్..

 

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యారు. గతంలో పెనుమాకలో జరిగిన ఓ సమావేశంలో సీఆర్డీఏ అధికారులతో ఆళ్ల గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ అధికారులు కేసు పెట్టారు. ఈ క్రమంలో, ఆళ్లతో సహా 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి వల్లే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. భూసేకరణ చట్టాన్ని, కోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu