టీచ‌ర్‌ని గొర్రె అన్నారు.. ఆమె ఆనందంగా ఏడిచింది!

మ‌న‌లో తొంభై శాతం మందికి విద్యార్ధి ద‌శ‌లో మాథ్స్ టీచ‌ర్ అంటే భ‌యం. క్లాసులో అప్ప‌టిదాకా కాస్తంత స‌ర‌దాగా వున్నపుడు మాథ్స్ టీచ‌ర్ రావ‌డంతో భ‌యం త‌ర‌గ‌తి గ‌దంతా ఆవ‌హిస్తుంది. భ‌యంతో కూడిన గౌర‌వం ప్ర‌ద‌ర్శించ‌డం ప‌రిపాటి. టీచ‌ర్ లెక్క త‌ప్పుచేస్తే తిట్ట‌డం లేదా  కొట్ట‌డం  చాలా స‌హ‌జం. విద్యా ర్ధులు పెద్ద అవ‌మానంగా తీసుకోవ‌డ‌మూ అంతే స‌హ‌జం.  కానీ  ఒక  వూళ్లో 8వ త‌ర‌గ‌తి విద్యార్ధులు టీచ‌ర్ ని  గొర్రె అన్నారు. ఆమెకి వాళ్లు  త‌న‌ని అలా పిల‌వ‌డంలో అస‌లు అర్ధం చాలా రోజుల త‌ర్వాత  తెలిసి ఎంతో ఆనందించింది.  ఇంత‌లా అభిమానించారా అని క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌యింది.

త‌న విద్యార్దులు త‌న‌ను గొర్రె అని పిలిచారు. ఆ పిల‌వ‌డంలో అంత‌రార్ధం ఏమిటో తెలీక టీచ‌ర్  చాలా బాధప‌డింది. ఆ మాట‌కు అర్ధ‌మేమిటి, పిల్ల‌లు త‌న‌ను అలా ఎందుకు పిలిచి వుంటారో ఎవ‌రైనా చెప్ప గ‌ల‌రా అని ఏకంగా సోష‌ల్ మీడియా రెడిట్ లో  ఈమ‌ధ్య‌నే  పోస్ట్ చేసింది. అది చ‌దివిన చాలామంది ఆమెను బాధ‌ప‌డ న‌వ‌స‌రం లేద‌ని అన్నారు. కార‌ణం టీచ‌ర్‌ని పిల్ల‌లు  ప్రేమ‌గానే  అలా స‌ర‌దాగా పిలిచా ర‌ని అర్ధంచేసు కోమని  నెటిజ‌న్లు  వివ‌ర‌ణ ఇచ్చారు.  కొంద‌రు విద్యార్ధ‌ల‌కూ మాథ్స్‌ టీచ‌ర్లంటే  గౌర‌వం వుంటుంది. వాళ్లూ స‌ర‌దాగా వారిలో వారు అలా నిక్‌నేమ్‌తో  పిలుచుకుంటూంటారు. బ‌హుశా ఈ టీచ‌ర్ అది వినే వుంటారు. పాపం ఎంతో బాధ‌ప‌డీ వుంటారు. 

గౌర‌వం వ్య‌క్తం  చేయ‌డంలో పిల్ల‌ల ప‌ద్ధ‌తి వేరుగా వుంటుంద‌నేది  ఆమె కాస్తంత  ఆల‌స్యంగానే తెలుసు కున్నారు.  త‌న‌ను గొర్రె అని పిల‌వ‌డంలో వారికి త‌న ప‌ట్ల ఎంతో అభిమానం, గౌర‌వం వుంద‌ని అందుకే అలా పిలిచేవార‌ని నెటిజ‌న్ల వివ‌ర‌ణ‌తో ఆమె ఎంతో పొంగిపోయింది. ఈసారి తిట్టుకోలేదు. భ‌డ‌వ‌ల్లారా ఇన్నాళ్లూ ఇంత ప్రేమాభిమానాల‌ను దాచుకున్నార్రా అని ఆనందంతో క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు ఆ టీచ‌ర్‌. టీచ‌ర్ల‌కు విద్యార్ధుల నుంచి డ‌బ్బులు అక్క‌ర్లేదు. మంచి విద్యార్ధులు, మంచి వ్య‌క్తులుగా స‌మా జంలో నిల‌వ‌డ‌మే కోరుకుంటారు. ఇంతటి  అభిమానమే ఆశిస్తారు.