చీమ‌లా.. మ‌జాకా!

చీమ‌లు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌ప‌డ‌తాయి. ఒక్క‌టిగానో,  గ్రూప్‌గానూ. ఏద‌యినా తిండి ప‌దార్ధం ద‌గ్గ‌రికి మాత్రం అనేక చీమ‌లు పోటీప‌డ‌వు, ఒక వ‌రుస‌గా వెళ్లి దాని మీద ప‌డి తింటాయి. అవి ఏ బెల్లం ముక్కనో లాక్కెళ్లం చూస్తూంటాం. ఏకంగా బాగా బ‌రువ‌యిన వ‌స్తువును లాక్కెళిపోవ‌డం విన్నారా?  ఏకంగా ఓ పెద్ద బంగారు గొలుసునే లాక్కెళ్లిపోయాయి. ఏదో ప‌చ్చ‌గా క‌దులుతోంద‌ని  నందా అనే వ్య‌క్తి  ప‌రిశీల‌న‌గా చూస్తే ఈ సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. 

చీమ‌లు శ్ర‌మ‌జీవ‌నానికి గొప్ప ఉదాహ‌ర‌ణ‌. వాటి  మ‌ధ్య  ఐక్య‌త ప‌టిష్ట‌మైన‌ది.  చాలా దూరం నుంచి ఏద‌న్నా తిండి ప‌దార్ధం తెచ్చుకోవాలంటే అనేక చీమ‌లు క‌లిసిక‌ట్టుగా వెళ్లి తెచ్చుకుంటాయి.  అయితే ఈ బంగారు గొలుసు విష‌యంలో చీమ‌ల్ని దొంగ‌లుగా చిత్రీక‌రించ‌లేం. బ‌హుశా ఆ గొలుసుకి  చ‌క్కెర లాంటి ఏ తీపి ప‌దార్ధమో ప‌ట్టి వుండ‌వ‌చ్చు.  కొండ‌ల ప్రాంతంలో  ఎవ‌రు పారేసుకున్నారో ఏమో మ‌రి. వారి తినే ప‌దార్ధ‌మేదో దానికి అంటిందేమో.. అటుగా వ‌చ్చిన చీమ‌లు ఆ గొలుసును ప‌ట్టి లాక్కెళ్లాయి. అయితే ఇది ఎక్క‌డ జ‌రిగింద‌నేది తెలియ‌లేదు.  ఇది చూసిన అట‌వీశాఖాధికారి సుశాంత్ నందా  వీడియో తీసేరు.  వేలమంది చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. 

ఒక‌రిద్ద‌రు చీమ‌ల‌కూ దొంగ‌త‌నం అంట‌గ‌ట్టారు. మ‌రికొంద‌రు  ఏదో నెల్లాళ్ల‌పాటు తినే వ‌స్తువ‌నుకుని పాపం క‌ష్ట‌ప‌డి లాక్కెళుతున్నాయోమోన‌ని, గొప్ప టీమ్ వ‌ర్క్‌కి వుదాహ‌ర‌ణా అనీ అన్నారు. ఇంకొంద‌రు  చీమ‌ల రాణికి సైనికులు గొప్ప బ‌హుమ తిగా తీసికెళుతున్నాయోమోన‌నీ అన్నారు. ఎవ‌రేమ‌న్నా, చీమ లకు మ‌న‌లా బంగారం పిచ్చి వుండ‌దుగా!