ఆండ్రాయిడ్ ఫోన్ కోసం ఆత్మహత్య
posted on Aug 2, 2014 5:33PM

ఆండ్రాయిడ్ ఫోన్ తండ్రి కొని ఇవ్వలేదన్న బాధతో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. స్థానిక దుర్గానగరంలో నివసించే వంశీ అనంతపురంలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించే వంశీ దానిని ఇటీవల పోగొట్టుకున్నాడు. తనకు మరో ఆండ్రాయిడ్ ఫోన్ కొని ఇవ్వాలని వంశీ గత కొన్నిరోజులుగా తండ్రిని అడుగుతున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేని తండ్రి కొంతకాలం తర్వాత కొంటానని చెప్పాడు. ఆండ్రాయిడ్ ఫోన్ లేకుండా కాలేజీకి వెళ్తే ఫ్రెండ్స్ ముందు పరువు పోతుందంటూ వంశీ చెబుతూ వుండేవాడు. రెండు రోజుల క్రితం కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కొడుకు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు వెతకగా వంశీ శరీరం రైల్వే ట్రాక్ పక్కన ముక్కలైపోయి కనిపించింది.