గన్ పట్టుకుని ఫొటో దిగబోయాడు.. పాపం...
posted on Aug 2, 2014 5:21PM
.jpg)
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగరంలో సుకుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నాలుగు చేతులా సంపాదించాడు. ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ బూమ్ పుంజుకోవడంతో సుకుమార్ చాలా బిజీగా వున్నాడు. తాను పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడం వల్ల తనకు శత్రువులు పెరిగే అవకాశం వుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా సుకుమార్ ఒక లైసెన్స్డ్ గన్ కొన్నాడు. అంతవరకూ బాగానే వుంది. తన దగ్గరున్న గన్‌తో కలసి ఫొటో దిగాలన్న ఆలోచన అతనికి వచ్చింది. ఆ గన్ చేతిలో పట్టుకుని పోజులిస్తూ ఫొటోలు దిగుతూ వుండగా పొరపాటుగా గన్ పేలి బుల్లెట్ అతని బాడీలో దిగింది. బంధువులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్ళడంతో ప్రాణాపాయం తప్పింది.