32 ఏళ్ల తరువాత భారత్ కు స్వర్ణం

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో కామన్ వెల్త్ క్రీడల్లో భాగంగా ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో కశ్యప్ 21-14, 11-21, 21-19 తేడాతో డెరెక్ వాంగ్ (సింగపూర్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 32 ఏళ్ల తరువాత బ్యాడ్మింటన్ సింగిల్స్ లో భారత్ కు లభించిన పసిడి పతకం ఇది. ఈ తాజా పతకంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 15 కు చేరింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu