స్ట్రొక్ సిండ్రోం తో జాగ్రత్త సుమా!

సెలూన్ లో హెయిర్ వాష్ తరువాత మహిళకు స్ట్రోక్ వచ్చిన ఘటన దిగ్బ్రాంతికి గురిచేసింది.

హైదరాబాద్ లో జరిగిన ఈఘటన మనకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఆమె 5౦ సంవత్చరాల మహిళ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటి అంటే స్థానికంగా ఉన్న బ్యూటీ పార్లర్ లో జుట్టు ను వాష్ చేసుకునేందుకు వెళ్ళింది. అమహిలకు బ్యూటి పార్లర్ లోనే స్ట్రోక్ సిండ్రోం కు గురి కావడం తీవ్ర కలకలం రేపింది 

అసలు ఎం జరిగింది అని తెలుసుకుంటే వివరాల లోకి వెళ్తే..

సెలూన్ లో ఘుమఘుమ లాడే షాంపూ తో జుట్టు వాష్ చేయించుకుంటే సుఖంగా ఉండగలమా అయితే జుట్టును వాష్ చేయడం లేదా శుభ్రం చేయడం ద్వారా కాస్త ఉపసమనం లభిస్తుంది.కాని చాలా మందికి మెడనొప్పి కూడా వస్తుంది. బేసిన్ పైన మెడను కొద్ది సేపు అలా గే ఉంచడం ద్వారా సమస్యలు ఎదుర్కుంటు న్నట్లు  తెలుస్తోంది చాలామంది వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విధంగా మెడను వేలాడదీయడం లేదా జుట్టును లాగిపెట్టి ఉంచడం వల్ల లేదా మెడను బేసిన్ లో ఎక్కువసేపు పెట్టి ఉంచడం వల్ల మెడనరాలు ఒత్తిడి గురికావడం అక్కడ రక్త ప్రసారం నిలిచిపోవడం లేదా అక్కడ  మెదడు కు ఆక్సిజన్ అందించే రక్త నాళాల ద్వారా ఆక్సిజన్ రక్త ప్రసారం అందకపోవడం వల్లే స్ట్రోక్ వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.దీనిని పార్లర్స్ట్రోక్ సిండ్రోం అని అంటారు ఇది అత్యంత తీవ్రంగా ఉంటె ప్రమాదమే అని అంటున్నారు.ప్రస్తుతం హైద్రాబాద్ లో జరిగిన ఘటన వివరాలు అపోలో ఆసుపత్రికి చెందినా సీనియర్ న్యురాలజిస్ట్ డాక్టర్ సుదీర్ కుమార్ ఈ  ఘటన పై ట్వీట్ చేసారు. యాభై సంవత్చారాల మహిళ పార్లర్ లో ఆమెజుట్టును వాష్ చేయించుకునేందుకు వచ్చిన సమయం లో స్ట్రోక్ వచ్చింది.లక్షణాలలో భాగంగా కళ్ళు తిరగడం, అలసట, వాంతులు వంటి లక్షణాలు ఉన్నాయి.ఇలాంటి ఘటనల పై కేలిఫోర్నియా ప్రోతిడెన్ సెంట్ జోన్స్ హెల్త్ సెంటర్ లోని న్యూరోలజిస్ట్ క్లిఫోర్ట్ సేగిల్ సి ఓ సెల్ఫ్ పత్రికతో మాట్లాడుతూ బ్యూటీ పార్లర్ సిండ్రోం ప్రారంభం లోనే అప్రమత్తంగా 
ఉండాలని సాధారణ స్ట్రోక్ కంటే భిన్నంగా వేరుగా ఉంటుందని దీనిలక్షణాలలో భాగం గా సంకేతంగా మీచేతులు అస్థిరంగా ఉంటాయని మైగ్రేయిన్ మస్దిరిగా తలనొప్పి రెండుగా కనపడడం.మేడపై వాపులు రుచిలో మార్పులు ఉంటాయి. సాధారణ స్ట్రోక్ లక్షణాలను పోలి ఉంటుంది.అందులో తిమ్మిరిగా ఉండడం నియంత్రణ కోల్పోవడం . మాటల తడబాటు మాట మాట్లాడడం కష్టం గా ఉండడం నీరసం కుప్పకూలి కూలిపోవడం అనుకోకుండా వ్యహరాలలో మార్పు రావడం గమనించవచ్చు.

పార్లర్ తో పాటు ఏ ఏ ప్రాంతాలలో స్ట్రోక్ వస్తుంది?

సెల్ఫ్ మ్యాగ్ జైన్ తో మాట్లాడుతూ హార్వార్డ్ మెడికల్ స్కూల్ లో న్యురాలజి అసోసియేషన్ ప్రొఫెసర్ అనీష్ సింఘాల్ మాట్లాడుతూ డెంటిస్ట్ దగ్గర చికిత్చకు వెళ్ళినప్పుడు స్ట్రోక్ సిండ్రోం రావచ్చు అని టెన్నిస్ ఆడే వారికి కైరో సాధన చేసే వారికి,యోగాసాధన చేసేవారికి స్ట్రోక్ సిండ్రోం రావచ్చు అని నిర్ధారించారు. అయితే సిండ్రోం సాధారణం కాదని కనేక్టివ్ టిష్యుల అనారోగ్యం తో పాటు బాధపడే వారికి బలహీనతలు తెలియని వారికి స్ట్రోక్ రావచ్చు.అయితే పార్లర్ లో హెడ్ వాష్ చేయించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ రకమైన స్ట్రొక్ సాధారణ ఘటన కాదని దీనిని నుండి రక్షింప బడాలంటే మీరు పార్లర్ కు దూరంగా ఉండాలి. మీ మెడను 1౦ నుండి 15 నిమిషాలు కన్నా ఎక్కువసేపు సరైన భంగిమలో లేకుండా చూసుకోండి. పార్లర్ లో హెయిర్ వాష్ చేసే సమయం లో మేడపైన సపోర్ట్ ఉంచండి.మెడను గట్టిగా ఒత్త్జి పట్టి ఉంచడం జుట్టుగాట్టిగా పట్టి లాగడం వంటి వి చేయవద్దని. సెలూన్ లో మేడపైన మెత్తటి కుషాన్ లేదా తలగడ ను అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలి.