రాక్ ఫెల్లర్ జీవితం చెప్పిన కథ ఇది!

ప్రపంచాన్ని డబ్బు శాసిస్తోంది. డబ్బు మనిషిని శాసిస్తోంది. కానీ మనిషి డబ్బు దగ్గర ఓడిపోతున్నాడు. నిజానికి మనిషి డబ్బును సంపాదించి తాను గెలిచాను అనుకుంటాడు.కానీ డబ్బు సంపాదిస్తే అది గెలుపు కాదు, డబ్బుకు లొంగకుండా జీవితాన్ని ఏ సమస్యా లేకుండా, వచ్చిన సమస్యలను అధిగమించినప్పుడే గెలిచినట్టు. 

జాన్ డి రాక్‌ఫెల్లర్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ప్రపంచంలోనే మొదటి బిలియనీర్ కూడా.  25 సంవత్సరాల వయస్సులో, అతను USలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకదానికి యజమాని అయ్యాడు. 31 సంవత్సరాల వయస్సులో, అతను ప్రపంచంలోనే చమురు శుద్దిచేసేవాళ్ళలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తరువాత  38 సంవత్సరాల వయస్సులో U.Sలో 90%  చమురును శుద్ధిచేసేవాడిగా గుర్తింపబడ్డాడు.  50 సంవత్సరాల వయసుకు దేశంలోనే అత్యంత ధనవంతుడుగా మారిపోయాడు. 

ఈయన యువకుడిగా ఉన్నప్పుడు  ప్రతి నిర్ణయం, వైఖరి మరియు సంబంధం అతని వ్యక్తిగత శక్తిని మరియు సంపదను సృష్టించడానికి అనుగుణంగా ఉండేది. దానివల్ల అతను చమురు ఉత్పత్తి చేసే వ్యాపారంలో తనకంటూ ఓ గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు. అయితే అంతా సవ్యంగా జరిగితే జీవితాల్లో వింతేముంది అన్నట్టు  ఈయన 53 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురయ్యారు. ఆ అనారోగ్య ప్రభావం వల్ల అతని శరీరం మొత్తం నొప్పితో నిండిపోయింది. ఆ నొప్పి తలుకూ ప్రభావాల వల్ల తన వెంట్రుకలను కోల్పోయాడు. దాని వల్ల పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, తనకు కావాల్సింది ఏదైనా కొనగల వ్యక్తి కేవలం సూపులు మాత్రమే తాగి వాటిని మాత్రమే జీర్ణించుకునే స్థాయికి దిగజారిపోయాడు. 

ఆ సమయంలో ఆయన స్నేహితుడు ఒకడు ఇలా అన్నాడు "రాక్ పెల్లర్  నిద్రపోలేడు, నవ్వలేడు. జీవితంలో అతనికి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు" అని.

అతని దగ్గర వ్యక్తిగతంగా ఎంతో గొప్ప నైపుణ్యం కలిగిన  వైద్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయనతో సంవత్సతంలోపు చనిపోవడం ఖాయం అని చెప్పారు.  ఆ సంవత్సరం చాలా నెమ్మదిగా గడిచిపోయింది. అతను మృత్యువుకు చేరువవుతుండగా అతనిలో ఆలోచనలు పెరిగాయి. చనిపోయిన తరువాత తన సంపదలో దేనినీ తనతో పాటు తీసుకెళ్లలేను అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత అతనిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 

ఒకరోజు ఉదయమే లేచి   "నా జీవితాన్ని నేను నియంత్రించుకోలేదు" అని అనుకున్నాడు.అప్పుడే అతనిలో ఒక ఆలోచన రూపు దిద్దుకుంది.  అతను తన న్యాయవాదులు, అకౌంటెంట్లు, మేనేజర్‌లను పిలిచి, తన ఆస్తులను హాస్పిటల్స్, రీసెర్చ్ మరియు ఛారిటీ వర్క్‌లకు పంపాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. జాన్ డి. రాక్‌ఫెల్లర్ తన ఫౌండేషన్‌ని స్థాపించాడు.

ఈ కొత్త దిశ చివరికి పెన్సిలిన్ యొక్క ఆవిష్కరణకు దారితీసింది, మలేరియా, క్షయ మరియు డిఫ్తీరియాకు నివారణల నివారణకు పెన్సిలిన్ ఎంతగానో సహాయపడింది

 రాక్‌ఫెల్లర్ జీవితంలో అత్యంత అద్భుతమైన విషయం ఒకటుంది. అదేమిటంటే అతను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని అందరికీ పంచడం మొదలుపెట్టిన తరువాత అతని శరీరం మందులకు పాజిటివ్ గా స్పందించడం మొదలుపెట్టింది. ఫలితంగా అతనిలో అనారోగ్యం క్రమంగా తగ్గిపోయి సాధారణస్థితికి చేరుకున్నాడు.   53 సంవత్సరాల వయస్సులో చనిపోవాల్సిన వ్యక్తి ఆశ్చర్యంగా 98 సంవత్సరాలు జీవించాడు.

ఆ తరువాత అతను తన జీవితంలో కృతజ్ఞత అనే విషయన్ని ఎప్పటికీ వదలకుండా తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవ కోసం వినియోగించారు.పూర్తిగా కొలుకున్న తరువాత ఆయన తన సంపాదన మొత్తాన్ని  దానం చేయడానికే నిర్ణయించుకున్నాడు. 

ఆయనఆ తన మరణానికి ముందు తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. 

“అన్నీ అతనికే చెందుతాయి, నేను అతని కోరికలను నెరవేర్చడానికి ఎంపికను మాత్రమే. ఒక తెలుయని శక్తి నాలో చోటుచేసుకున్న కొత్త ఆలోచనలు, జీవితంలో కొత్త మలుపులకు కారణం అయ్యింది"

"నా జీవితం ఒక సుదీర్ఘమైన, సంతోషకరమైన సెలవుదినం. పూర్తి పని, పూర్తి ఆటతో నేను ఆందోళనను దారిలో వదిలిపెట్టాను. దేవుడు తో ప్రతిరోజూ నాకు మంచిరోజు.” అని.

పై విషయం అంత తెలుసుకుంటే మనిషి తన జీవితంలో సంపాదించే దాంట్లో కొంత భాగాన్ని దానం చేయడం వల్ల కూడా జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి అద్బుతాలు చేస్తాయని అర్థమవుతుంది.

◆వెంకటేష్ పువ్వాడ.