రికార్డు మార్కును తాకిన నిఫ్టీ...

 

ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మంగళవారం రికార్డు మార్కును తాకిన నిఫ్టీ.. నేడు దాన్ని తిరగరాసింది. ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరింది. సెన్సెక్స్ 188 పాయింట్లు లాభపడి 29,856 వద్ద ముగిసింది. నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 9,154 వద్ద ట్రేడ్ అయింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌లో అదానీపోర్ట్స్‌, టాటాస్టీల్‌, హిందాల్కో, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌ బ్యాంకు షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu