కేంద్ర మంత్రికి పై చెప్పు విసిరిన అగంతకుడు..

 

కేంద్ర మంత్రి  పి.రాధాకృష్ణన్‌ కు చేదు అనుభవం ఎదురైంది. తన సొంతరాష్ట్రం తమిళనాడులో ఓ అగంతుకుడు ఆయనపై చెప్పులు విసిరాడు. వివరాల ప్రకారం... జేఎన్‌యూలో సమానత్వం లేదని పేర్కొంటూ ముత్తు కృష్ణన్ అనే విద్యార్ది స్నేహితుడి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే అతని అంత్యక్రియలకు పి.రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అగంతకుడు చెప్పు విసిరాడు. అయితే విసిరిన చెప్పు ఆయనకు దూరంగా, కెమెరాలపై పడడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. కాగా దళితుడైన కారణంగానే యూనివర్సిటీలోని ఓ ప్రొఫెసర్ క్రిష్‌ ను వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని తమిళ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu