దత్త తండ్రి దత్తపుత్రుడితో మాట్లాడిస్తున్నారు...జగన్
posted on Oct 20, 2022 2:15PM
జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వీధిరౌడీలా బూతులు తిడుతూ చెప్పు చూపించడం ఎక్కడి సంస్కా రమని ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రశ్నించారు. మూడు రాజధానులు ప్రజాసంక్షేమాన్ని ఆశించే ప్రతి పాదిం చానని కానీ పవన్ మూడు పెళ్ళిళ్లు చేసుకోవాలని అనడం రాష్ట్రంలో మహిళలు సిగ్గుపడుతున్నా ని, ఇటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏరకంగా దశ దిశా చేస్తారని జగన్ ప్రశ్నించారు.
ఇటీవల పవన్ వైసీపీపై విరుచుకుపడటం, మాటలతూటాలతో రెచ్చిపోవడం తెలిసిందే. అందుకు స్పందిస్తూ, తనను కొట్టడానికి చంద్రబాబు, మీడియా ఏకమయ్యాయరని, తనకు దేవుడు, ప్రజలు, కార్యకర్తలు అండగా ఉన్నారన్నారు. దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమి మాట్లాడిస్తున్నారో అందరం చూస్తున్నామని జగన్ అన్నారు.
వెన్నుపోటు దారులంతా కలిసి కూటములు కట్టి యుద్దం చేస్తామంటున్నారని జగన్ అన్నారు. ఒక్క జగన్ను కొట్టటానికి ఇంత మంది ఏకం అవుతున్నారన్నారు. ఇది మంచికి , మోసానికి జరుగుతున్న యుద్దమని, పేదవాడికి , పచ్చ చొక్కాల పెత్తందారుకు మధ్య యుద్దంగా అభివర్ణించారు. మంచి జరిగిన ప్రతీ ఇంటి నుంచి ప్రతీ ఒక్కరూ తనకు తోడుగా నిలుస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. వాళ్లలాగా కుట్రలు, కుతంత్రాలను నమ్ముకోలేదని సీఎం జగన్ పేర్కొన్నారు.