హుజూర్ నగర్ ఉప ఎన్నిక బిజెపి అబ్యర్ధిగా శ్రీ కళారెడ్డి...
posted on Sep 25, 2019 11:15AM

కాంగ్రెస్ కంచుకోట హుజుర్ నగర్, ఈ కోటను బద్దలు కొట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటు వరుస విజయాలను కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని రంగం లోకి దించబోతోంది ఆమె శ్రీ కళారెడ్డి. కీసర శ్రీ కళారెడ్డి బిజెపి హుజూర్ నగర్ అభ్యర్థి, ఈమె తండ్రి జితేందర్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఇంటిపెండెంట్ గా గెలిచారు. ఆమె భర్త ధనుంజయ్ యూపీ నుంచి గతంలో ఎంపీగా పని చేశారు.
ఇలా ఆమె ఫ్యామిలీ నుంచి ప్రజాప్రతినిధులు చట్ట సభల్లోకి వెళ్లారు, ఈమె కూడా రాజకీయాల్లో రాణించేందుకు ఎప్పటి నుంచో తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న శ్రీకళారెడ్డిని హుజూర్ నగర్ లో బలమైన అభ్యర్థిగా బీజేపీ భావిస్తోంది. రాజకీయాలపై ఆసక్తి ఉన్న శ్రీకళారెడ్డి రెండు వేల నాలుగు టిడిపిలో చేరారు. అక్కడి నుంచి రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టారు, ఎమ్మెల్యే కావాలనే కోరికతో కోదాడ టిడిపి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు.
ముఖ్యమంత్రులే హెలికాప్టర్ లో తిరిగేందుకు వెనుకాడే సమయంలో ఈమె ఏకంగా నన్ను గెలిపించాలని హెలికాప్టర్ లో కరపత్రాలు పంచి సంచలనం సృష్టించారు. అయితే ఆ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఆమె వైసిపిలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇటీవల రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహనరావుతో కలిసి బీజేపీలో చేరారు. ఇపుడు ఏకంగా హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. కోదాడ నుంచి ఎమ్మెల్యే కావాలనేది ఆమె చిరకాల కోరిక, అనుకోకుండా హుజూర్ నగర్ ఉప ఎన్నిక రావడంతో ఆమెను బీజేపీ బరిలోకి దింపింది. ఆమె సరైన అభ్యర్థి అని భావిస్తోంది. కాంగ్రెస్, టి.ఆర్.ఎస్ తో పాటు ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.