ప్రకాశం జిల్లా అధికార పార్టీలో పోరు...

 

అసలే అధికార పార్టీ, అభివృద్ది పనులు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు ఇదే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గం లోని ప్రతి గ్రామంలో నాలుగైదు గ్రూపులకు కారణమైంది.  అంతా వైసీపీకి చెందిన వారే, ఒత్తిడి ఎక్కువ, పనులు తక్కువ. దీంతో అందరినీ సమన్వయం చేసుకోవడం ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి సవాలుగా మారింది. మరోవైపు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే రాంబాబుల మధ్య అంతరం పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో రెండో అత్యధిక మెజారిటీ లభించిన స్థానం గిద్దలూరు. వైసీపీ తరపున పోటీ చేసిన అన్నా రాంబాబుకు ఇక్కడ ఎనభై ఒకవేళ మెజార్టీ వచ్చింది. దీంతో సహజంగానే ఓటేసిన అందరి నుంచి పనుల కోసం ఒత్తిడి పెరిగిందట. రెండు వేల తొమ్మిదిలో రాజకీయ రంగ ప్రవేశం తర్వాత రాంబాబు అనేక పార్టీలు మారాల్సొచ్చింది. పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంబాబు, ఆ తర్వాత కాంగ్రెస్ లో కలిశారు. రాష్ట్ర విభజనానంతరం పరిణామాలతో టిడిపిలో చేరారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందువల్ల ఆయనతో పీఆర్పీ నుంచి కొనసాగుతున్నవారు ఒక గ్రూప్ అయితే కాంగ్రెస్ లో కలిసిన తరవాత మరో గ్రూపు. ఆ తర్వాత టీడీపీలో తనను అనుసరించిన వారు ఇలా మూడు, నాలుగు గ్రూపులు రాంబాబుతో కలిసి నడుస్తున్నాయి. ఇప్పుడు వైసిపి గ్రూపు కలవడంతో నియోజకవర్గంలో ఐదు, ఆరు గ్రూపులుగా మారాయి. వీరందరినీ సమన్వయం చేసుకోవడమే రాంబాబుకి పెద్ద సమస్యగా మారిందట.

గ్రామ వాలెంటీర్ల నియామకం, నీళ్ల ట్యాంకర్ ల కాంట్రాక్టు ఇప్పించటం లాంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఎమ్మెల్యేకి ఎదురవుతున్నాయట. అధికారుల బదిలీలు రేషన డీలర్ల మార్పు తదితర విషయాల్లోను సమస్యలు తప్పడం లేదట. నియోజకర్గ పరిస్థితుల్ని విస్తృతంగా పరిశీలిస్తే అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయేందుకు ఆయన అత్యధిక ప్రాధాన్యమిచ్చినా గ్రూపు గొడవలు పెద్ద తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది. గిద్దలూరు మండలంలోని ఒక గ్రామంలో వాలెంటీర్ ఎంపిక సమస్య ఆయనకు మద్దతిస్తున్న రెండు వర్గాల మధ్య పోటీ పెరిగి ప్రతిష్టాత్మకమైందట.
వారి మధ్య సమన్వయం కోసం ఆయన ఒక రోజంతా ఆ గ్రామ సమస్య పైనే సంప్రదింపులు జరపక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే అన్నా రాంబాబు మధ్య గ్యాప్ ఉన్నట్లు సమాచారం. వారి మధ్య బహిరంగంగా వివాదాలు లేకపోయినా మర్యాదపూర్వకమైన పలకరింపులు కూడా వారి మధ్య ఉన్నట్టు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కూడా ఇద్దరూ ఒకే పార్టీ నుంచి ఒకరు ఎంపిగా మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా కలిసి ప్రచారం చేసిన దాఖలాల్లేవు.

ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరి గ్రూపుల వారు మెయింటెన్ చేసుకోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడిపోయారట. ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు కోప్పడతారో అర్థం కాక అసలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇంటి పోరు ఇంతింత కాదయా అన్నట్టుగా గిద్దలూరు వైసిపిలో క్యాడర్ నిరుత్సాహపడుతున్నారట. ఇప్పటి కైనా అధిష్టానం కల్పించుకొని గిద్దలూరులో గ్రూపు విభేదాలకు చెక్ పెట్టకపోతే పార్టీ పరిస్థితి దారుణంగా మారుతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu