స్పీడ్ న్యూస్ 1

1. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ ఒకింత తగ్గింది. సోమవారం శ్రీవారిని 71వేల 804 మంది దర్శించుకున్నారు. 25వేల 208 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 5.40 కోట్ల రూపాయలు వచ్చింది.

...............................................................................................................................................................

2. కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ  కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని  చిన్మయ మిషన్ హాస్పిటల్  చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.

...............................................................................................................................................................

3. తెలంగాణలో  వ్యాప్తంగా ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం రేపటి నుంచి శుక్రవారం వరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

..............................................................................................................................................................

4. చంద్రయాన్ రాకెట్ శకలం ఒకటి ఆస్ట్రేలియా  సముద్ర తీరంలో  కనిపించిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అక్కడి సముద్ర తీరం వద్ద కనిపించిన  డ్రమ్ము ఆకారంలో ఉన్న ఆ వస్తువు చంద్రయాన్  శకలం అయి ఉంటుందని భావిస్తున్నట్లు అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు.

......................................................................................................................................................

5. జమ్మూకశ్మీరులో  నిన్న రాత్రి  జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.  వీరు విదేశీయులని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హతమైన ఉగ్రవాదులు విదేశీయులని భావిస్తున్నారు.  సింధారా, పూంచ్ ప్రాంతాల్లో  కూంబింగ్ సందర్భంగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

..........................................................................................................................................................

6.పొలండ్‌ రాజధాని వార్సాకు  47 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్‌ఫీల్డ్‌ వద్ద విమానాలు నిలిపి ఉంచే హ్యాంగర్‌ఫై సెస్నా 208 అనే చిన్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హాంగర్‌లో ఉన్న నలుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

..............................................................................................................................................................

7. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల   రెండో వారంలో  జరగనున్నాయి.  ప్రభుత్వ బిల్లుల ఆమోదంపై ప్రభుత్వానికి, గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మధ్య  విభేదాల  నేపథ్యంలో ఈ సమావేశాలలో కొత్త బిల్లులేవీ ప్రవేశపెట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

..........................................................................................................................................................

8. యమునా నది వరద నీరు ప్రసిద్ధ వారసత్వ కట్టడం తాజ్ మహల్ ను తాకింది. గత 45 సంవత్సరాలలో యమునానది వరద తాజ్ మహల్ ను తాకడం ఇదే తొలిసారి. యమునా  వరద కారణంగా  రామ్‌బాగ్‌, ఎత్మాదుద్దౌలా, జోహ్రీ బాగ్‌, మెహ్‌తాబ్‌ బాగ్‌  వంటి కట్టడాలకు ముంపు పొంచి ఉన్నది.  

...............................................................................................................................................................

9. మణుగూరు బీటీపీఎస్​ లో ప్రమాదవశాత్తు కాంట్రాక్టు కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు.    బిహార్ రాష్ట్రానికి చెందిన సచిన్ మోహత్ కుబేర్  అనే కాంట్రాక్ట్ కార్మికుడు  బీటీపీఎస్​లోని చిమ్నీపైకి ఎక్కి పనులు చేస్తూ కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.  

..........................................................................................................................................................

10.  మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైసీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారు.   వేటపాలెం వద్ద రొయ్యల ఫ్యాక్టరీలో వాకింగ్ చేస్తుండగా ఆయనను పాము కాటు వేసింది.  ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

.............................................................................................................................................................

11. కేదార్‌నాథ్  ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్లను నిషేధిస్తూ  బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.  ఒక‌ యూట్యూబర్ కేదార్‌నాథ్ ఆలయం వ‌ద్ద‌  ల‌వ‌ర్‌కి ప్రపోజ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో కేదార్‌నాథ్ ఆలయ పవిత్రత దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

..............................................................................................................................................................

12. డెంగీ జ్వరాలు హస్తినను వణికిస్తున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ నెల 15 వ తదీవరకూ 163 మంది డెంగీ జర్వం బారిన పడ్డారు. యమునా నది వరదల కారణంగా పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెరిగిం డెంగీ జ్వరాలు వ్యాపిస్తున్నాయి.

......................................................................................................................................................

13.  దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది.   మంగళవారం ఉదయానికి యమునానది నీటి మట్టం 206 మీటర్లకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

.....................................................................................................................................................

14. జమ్మూ కశ్మీరులో ఓ చిరుతపులి దాడి ఘటనలో 12 మంది గాయపడ్డారు.  దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలోని అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన చిరుత పులి సల్లార్ గ్రామంలోని జనావాసాలపై దాడికి పాల్పడింది. 

..........................................................................................................................................................

15.   ముంబయిలో అధికారులు వీధి కుక్కల బెడతను నియంత్రించి, వాటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు.   పౌరులకు ఆధార్ కార్డ్ లా వీధి శునకాలకు కూడా వాటికి సంబంధించిన సమాచారంతో   క్యూఆర్ కోడ్‌తో కూడిన ఐడెంటిటీ కార్డులు తగిలించారు.

.............................................................................................................................................................