స్వీడ్ న్యూస్ 3

21. జగనన్న స్మార్ట్‌ సిటీ నిర్మాణానికి వ్యతిరేకంగా బద్దేలులో  ఎస్సీలు ఆందోళనకు దిగారు.  తమకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారంటూ  జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు.  ఈ సందర్భంగా  పోలీసులు, ఎస్సీలకు మధ్య తోపులాట జరిగింది.

..........................................................................................................................................................

 22. కోడిని కుక్క కరిచిన ఘటన వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఘర్షణకు కారణమైంది. ఉమ్మడి కడప జిల్లా మాధవరం గ్రామంలో  జరిగింది. స్థానిక  తెలుగుదేశం నేతకు చెందిన కోడిని  వైసీపీ నేత పెంపుడు కుక్క కరవడంతో ఇరు వర్గాల మధ్యా ఘర్షణ జరిగింది. ఈ దాడిలో  ఒకరు గాయపడ్డాడు.

...................................................................................................................................................

23. ఓటర్ల జాబితాలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారి ఓట్లు పెద్ద సంఖ్యలో గల్లంతయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు.  ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందో, లేదో చెక్ చేసుకోండని సూచించారు. ఓటు లేకపోతే వెంటనే ఓటరుగా మీ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. 

.............................................................................................................................................

24.  బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో  నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే బీజేపీయేతర పక్షాల సమావేశాన్ని దేశ ముఖచిత్రాన్ని మార్చే  సమావేశంగా కర్నాటక  డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు.  140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్ ను మార్చే   సమావేశమన్నారు.

........................................................................................................................................................

25. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో   రానున్న మూడు  రోజులూ  వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు  కురుస్తాయనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

....................................................................................................................................

26.  ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో  ప్రజలకు సగం ధరకే  టమాటాలు దొరుకుతున్నాయి. భారత ప్రభుత్వ సహకారంతో ఎన్‌సిసిఎఫ్‌ఐ ద్వారా.. లక్నోలోని 11 చోట్ల టమాటోలను మొబైల్ వ్యాన్‌లలో కిలో రూ.80కి ప్రజలకు అందుబాటులో  ఉంచుతోంది యోగి సర్కార్.

..........................................................................................................................................................

27.  జనసేన కార్యకర్తపై చేయిచేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై పవన్ కల్యాణ్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు చేయడం కోసమే ఆయన తిరుపతి వచ్చారు.  కాగా ఇప్పటికే సీఐ అంజూ యాదవ్ కు ఛార్జ్ మెమో జారీ చేశారు.

.............................................................................................................................................

28.  మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే వింధ్య ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. వింధ్య రీజియన్ ప్రత్యేక రాష్ట్ర హోదా సాధన కోసం  ప్రజలు స్థాపించిన  పార్టీ వింధ్య జనతా పార్టీకి తాను నేతృత్వం వహిస్తానని  ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి తెలిపారు.

..................................................................................................................................

29.  అగ్రరాజ్యాన్ని పిడుగులతో కూడిన వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి.  ముఖ్యంగా   ఈశ్యాన్య ప్రాంతంలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.  దీంతో ఈశ్యాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దయ్యాయి.  అలాగే భారీ వర్షాల కారణంగా ఈశాన్య అమెరికా  వరద ముంపులో చిక్కుకుంది.

..........................................................................................................................................................

 

30.  భారీ వర్షాలు ఉత్తర భారత దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.  భారీ వర్షాలతో హరిద్వార్‌ వద్ద గంగానది  ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది.  దీంతో హరిద్వార్‌, రూర్కీ, ఖాన్‌పుర్‌, భగవాన్‌పుర్‌, లస్కర్‌ పరిధిలోని అనేక గ్రామాల్లో వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu