స్పీడ్ న్యూస్ 1

1.

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం శ్రీవారిని 86 వేల 170 మంది దర్శించుకున్నారు. 31 వేల 128 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

...........................................................................................................................................................

2. దొంగలు ఏటీఎంలో  ఏసీని దోచుకెళ్లినఇ సంఘటన పంజాబ్ లోని  బాఘ్ పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఓ  ఎస్‌బీఐ ఏటీఎంలో ఆదివారం ఇద్దరు దొంగలు ఏటీఎంలో అమర్చిన ఏసీని దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు వైరల్ అవుతున్నాయి.

............................................................................................................................................................

3.పాకిస్థాన్‌లోని  సింధ్ ప్రావిన్స్‌లోని కాష్మోరే ప్రాంతంలోగల ఓ హిందూ దేవాలయంపై కొందరు దోపిడీ దారులు రాకెట్ లాంచర్లతో దాడికి తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో రాకెట్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.   

............................................................................................................................................................

4.  రంగారెడ్డి జిల్లా  బూర్గుల శివారులోగల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో  ఆదివారం సంభవించిన పేలుడులో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.  గ్యాస్ సిలెండర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది.  

............................................................................................................................................................

5. విమానం గాల్లో ఉండగానే పైలట్ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో  ఓ ప్రయాణీకురాలే   విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు.   శనివారం అమెరికాలోని  విన్‌యార్డ్‌ ఎయిర్‌పోర్టులో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.  

............................................................................................................................................................

6.  భోపాల్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌‍ప్రెస్‌లో  సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. రైలులోని సీ-14 కోచ్‌ వద్ద మంటలు వ్యాపించాయి.  దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి.  

............................................................................................................................................................

7.  మంత్రి కేటీ రామారావుకు బెర్లిన్‌ నగరంలో నిర్వహించే  ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పాలసీ అలయెన్స్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానం అందింది.   ప్రపంచ నిపుణులతో కూడిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది.

............................................................................................................................................................

8.  మేడ్చల్ జిల్లా దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బహదూర్ పల్లి సమీపంలోని టెక్ మహీంద్ర వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను యువరాజు, నాయుడుగా గుర్తించారు.

............................................................................................................................................................

9. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం తిరుపతికి రానున్నారు. జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై ఆయన తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.  ............................................................................................................................................................

10. ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ లో నిత్యావసరాల ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పాక్ లో గోధుమ పిండి ధర రికార్డు స్థాయిలో 320 రూపాయలకు చేరిందని పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu