ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి!

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. అంతుకు ముందు ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అనంతరం పార్లమెంటుకు చేరుకున్నారు. కేబినెట్ నిర్మలమ్మ పద్దును ఆమోదించింది.

అనంతరం లోక్ సభ ప్రారంభం అయ్యింది. వెంటనే నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు.

ఉపాథి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వంగడాలు, వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం అన్న అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజాశీర్వాదంతో మూడో సారి అధికారంలోకి వచ్చామన్న ఆమె అన్నదాతల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu