ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి తప్పిన ప్రమాదం
posted on Nov 21, 2020 3:14PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొని ఓ ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో స్పీకర్ కారు కూడా అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్పీకర్ తమ్మినేని సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రసంగించగా, తమ్మినేని సీతారాం డిప్యూటీ సీఎం ధర్మానతో కలిసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో ఆయన కారుకు ప్రమాదం జరిగింది.