బీజేపీలోకి సీనియర్ హీరోయిన్....రోజా అసలు పోటీనే కాదట !

 

ఒకప్పటి తెలుగు హీరోయిన్ ప్రియా రామన్ బీజేపీలో చేరారు. తిరుపతిలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తిని కలిసిన ఆమె ఆయన సమక్షంలో బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. సమాజసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని పేర్కొన్న ప్రియా రామన్, ప్రధాని నరేంద్ర మోడీ తనకు రోల్‌ మోడల్ అని పేర్కొన్నారు. అయితే రోజాకి పోటీగా బీజేపీ ఆమెను రంగంలోకి దిమ్పుతుందని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టిన ఆమె రోజా తనకు మంచి స్నేహితురాలని, తాము పోటీదారులం కాదని పేర్కొంది. 

ఏపీ రాజకీయాలపై ఇప్పుడప్పుడే తానేమీ మాట్లాడలేనని.. పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానని తెలిపారు. 44 ఏళ్ల ప్రియా ప్రియారామన్ కేరళ   పాల్ఘాట్‌ నాయర్‌ కుటుంబం నుండి వచ్చారు. ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. అయితే సినిమాలలో నటిస్తూనే పలు తమిళ సీరియళ్లలో నటిస్తూ ఆమె చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆమె చివరగా గతేడాది వచ్చిన శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో నటించారు.