సికిందరాబాద్ స్టేషన్ మూసివేత?.. కారణమేంటో తెలుసా?

సికింద్రాబాద్ రైల్వే‌స్టేషన్  ఆధునీకరణ పనుల కారణంగా వంద రోజుల పాటు స్టేషన్ లోని ఆరు ప్లాట్ ఫారమ్ లను క్లోజ్ చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా సికిందరాబాద్ నుంచి దాదాపు 120 రేళ్లు సికిందరాబాద్ కు రావు. వీటిని చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లిస్తారు.  సికిందరాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌లను నిర్మించనున్నారు.

తొలుత 3 నుంచి 5 నంబర్ ప్లాట్ ఫారమ్ ల పనులను చేపడతారు. ఈ పనులు దాదాపు 50 రోజుల పాటు సాగుతాయని అంచనా, ఈ పనులు పూర్తి అయిన తరువాత  పదో నంబర్ ప్లాట్ ఫామ్ వైపు పనులను చేపడతారు. ఆధునీకరణ పూర్తియన తరువాత సికిందరాబాద్ రైల్వే స్టేషన్ రూపురేకలు మారిపోతాయనీ, అంతర్జాతీయ విమానాశ్రయానికి దీటుగా ఈ రైల్వే స్టేషన్ ఉంటుందనీ అధికారులు చెబుతున్నారు. ఆధునీకరణ పనుల నేపథ్యంలో ప్రయాణీకులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్న అధికారులు వంద రోజుల పాటు ప్రయాణీకులు రైళ్ల కోసం చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు వెళ్లాలని కోరారు.