ఘనంగా సిద్ధార్థ్‌, అదితిరావు పెళ్లి.. 400 ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయంలో...

హీరో సిద్ధార్థ్‌ (Siddharth), హీరోయిన్ అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. తెలంగాణ వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరి వివాహం జరిగినట్లు సమాచారం. ఈ ఆలయానికి 400 ఏళ్ళ చరిత్ర ఉంది.

పెళ్లి ఫోటోలను తాజాగా సోషల్ మీడియా వేదికగా అదితిరావు పంచుకుంది. ఆ ఫోటోలలో సిద్ధార్థ్-అదితి జోడి చూడ ముచ్చటగా ఉంది.

సిద్దార్ధ్ కి 2003 లో మేఘన అనే అమ్మాయితో  వివాహం జరిగింది. ఆ తర్వాత 2007 లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. 17 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అదితిరావుని రెండో పెళ్లి చేసుకున్నాడు.

సిద్దార్ధ్, అదితిరావు 'మహా సముద్రం' అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇప్పుడు ఆ ప్రేమ పెళ్లిపీటలు ఎక్కింది. కాగా, అదితరావుకి ఇది రెండో వివాహం. గతంలో సత్యదీప్ మిశ్రాతో వివాహం కాగా, 2013 లో విడాకులు తీసుకుంది.