ఆ ఫోటోలు ప్రభాస్,హను రాఘవపూడి సినిమావి కాదు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)లిస్ట్ లో ఉన్న క్రేజీ ప్రాజక్ట్స్ లో సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి(hanu raghavapudi)మూవీ కూడా ఒకటి. లవ్ కి, ఎమోషనల్ జోడించి చెప్పడంలో హను మంచి స్పెషలిస్ట్. ప్రభాస్ కూడా ఆ రెండిటిలో ఒక రేంజ్ పెర్ఫార్మెన్సు ని ప్రదర్శిస్తాడు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆ క్రేజీ కాంబో పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో అధికారకంగా ప్రారంభమయిన ఈ  కాంబో త్వరలోనే షూట్ కి కూడా వెళ్లనుంది. అయితే ఇప్పుడు వస్తున్న ఒక  ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది.

ప్రభాస్, హను మూవీకి సంబంధించిన సినిమా సెట్టింగ్స్ ఇవే నంటూ పలు ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సెట్స్ కూడా భారీ స్థాయిలో ఉండటంతో ఇదేంటి ఒక్క షెడ్యూల్ కూడా కంప్లీట్ అవ్వకుండా ఫొటోస్ లీక్ అవ్వడం ఏంటని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా భావించారు. అయితే ఇప్పుడు ఆ ఫొటోస్ ఫేక్ అని తెలుస్తుంది.మూవీకే వర్క్ చేస్తున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టిన  పిక్స్ చూసి చాలా మంది ప్రభాస్, హను సినిమా సెట్స్  అనుకుంటున్నారు. కానీ అవి  సినిమా సెట్టింగ్స్ కాదని, అతను జనరల్ గా తన సోషల్ మీడియాలో పెట్టుకున్న పిక్స్ అని  చిత్ర యూనిట్ తెలియచేసింది. 

1940 మధ్య కాలంలో జరిగే  హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఫౌజీ అనే పేరు పరిశీలనలో ఉంది.ప్రెజంట్ వర్క్ టైటిల్ కూడా ఇదే. అలాగే సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి(imanvi)ని హీరోయిన్ గా ఎంపిక చేసి క్యాస్టింగ్  విషయంలోను ఇప్పటికే ఒక సంచలనాన్ని నమోదు చేసింది.ప్రభాస్ వంటి స్టార్ సరసన ఆమెని ఎంచుకోవడం నిజంగా ఒక సంచలనమే అని చెప్పవచ్చు. ప్రతిష్టాత్మక సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.