అన్నం పెట్టలేదని భార్యను కాల్చిన భర్త
posted on Jul 10, 2017 3:11PM

చిన్న చిన్న కారణాలతో భార్యలను చంపుతున్నారు భర్తలు. అలాంటి ఒక ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఘాజియాబాద్ మన్‌సరోవర్ పార్క్ కాలనీలో నివసిస్తున్న అశోక్ కుమార్, సునైనలకు ఇద్దరు పిల్లలు..రోజూ తాగి రావడం భార్యతో వాగ్వివాదం పెట్టుకోవడం లేదంటే కొట్టడం ఇదే అశోక్ పని. ఎప్పటిలాగే గత శనివారం కూడా తాగి వచ్చిన అతను భార్యతో గొడవ పెట్టుకున్నాడు..అనంతరం భోజనం పెట్టమని చెప్పాడు..ఆమె ఎంతకీ రాకపోవడంతో అశోక్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు..అయితే అప్పటికే సునైన మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..