నువ్వు జాగ్రత్తగా వెళుతున్నా..పక్కవాడు అలాగే వస్తాడా..?
posted on Jul 10, 2017 12:28PM

మన పెద్దలు అంటూ ఉంటారు..రోడ్డు మీద వెళుతున్నప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని..కానీ మనం ఎంతగా..ఎన్ని జాగ్రత్తలు పాటించినా..పక్కవాడు అలాగే వస్తాడని గ్యారెంటీ లేదు కదా..ఢిల్లీలో ఇవాళ జరిగిన ఈ సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. దేశరాజధానికి అతిసమీపంలోని గ్రేటర్ నోయిడాలో 8 వరుసల ఎక్స్‌ప్రెస్ వే మీద వాహనాలు దూసుకెళ్తుంటాయి. ఓ మార్గంలో వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ఎడమవైపు వెళ్తున్న లంబోర్గనీ కారు ను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ వాహనాన్ని డ్రైవర్ ఎడమవైపుకు తిప్పాడు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో మరో వరుసలో వస్తున్న మారుతి కారు లంబోర్గనీని ఢీకొట్టి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి..అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..ఇక్కడ ఎవరో చేసిన తప్పుకు మారుతి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి బలి కావాల్సి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించి ఒక వరుస నుంచి మరో వరుసలోకి మారేందుకు ప్రయత్నించడమే ప్రమాదానికి కారణం.