బూట్ల వివాదం...మరోసారి చిక్కుల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి..

 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో మధ్యప్రదేశ్ లో వరదలు వచ్చినప్పుడు ప్రజలను పరామర్శించడానికి వెళ్లిన ఆయనను.. భద్రతా సిబ్బంది ఆయనను మోసుకెళ్లడంపై తీవ్ర విమర్సలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బుక్కయ్యారు ముఖ్యమంత్రిగారు. ఉజ్జయినీలో జరిగిన పార్టీ శిక్షణా శిబిరానికి హాజరైన ఆయన మార్గమధ్యంలో జైన మత సన్యాసి ప్రగ్యా సాగర్ ఆశ్రమం వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఆయన తన బూట్లను విప్పి... దగ్గర్లోనే ఉన్న శిక్షణా శిబిరానికి బూట్లు లేకుండానే నడుచుకుంటూ వెళ్లారు. అయితే సీఎం గారు బూట్లను భద్రత అధికారి చేతుల్లో పట్టుకొని వెంట నడిచారు. ఇంకేముంది ఇది కాస్త అక్కడ ఉన్న వారిలో ఓ వ్యక్తి ఫొటో తీసి దానిని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసిన నెటిజన్లు ఊరుకుంటారా.. ముఖ్యమంత్రిగారిపై విమర్శలు కురిపిస్తున్నారు. మరి దీనికి సీఎం గారు ఏం సమాధానం చెబుతారో చూద్దాం..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu