బాలికపై లైంగిక దాడి... పారిపోయిన ఎమ్మెల్యే అరెస్ట్....
posted on Jan 7, 2017 10:33AM

బాలికపై దాడి చేసి పారిపోయిన ఎమ్మెల్యేను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేఘాలయలో చోటుచేసుకుంది. మేఘాలయ ఎమ్మెల్యే జూలియస్ డార్పాంగ్ 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు డార్పాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది తనను గెస్ట్హౌస్‌కు పిలిపించి దాడికి పాల్పడ్డారంటూ బాధిత బాలిక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఇప‍్పటికే ఆ రాష్ట్ర హోంమంత్రి కుమారుడితో పాటు నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే బాలిక ఫిర్యాదుతో అజ్ఞాతంలో వెళ్లారు. అప్పటి నుండి పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఎట్టకేలకు గౌహతిలో ఆయనను ఆరెస్ట్ చేశారు. అక్కడినుండి ఆయనను షిల్లాంగ్‌లోని సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.