అలా చేస్తే సీఎం అభ్యర్థిగా నేను తప్పుకుంటా...

 

త్వరలో జరగబోయే యూపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక పార్టీలన్నీ ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలా అని మంతనాలు మొదలుపెట్టేసినట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే షీలా దీక్షిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమని..  కాంగ్రెస్‌-ఎస్పీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే.. పార్టీ సీఎం అభ్యర్థిగా తాను తప్పుకొనేందుకు సిద్ధమని అన్నారు. హిందుత్వ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కొనేందుకు లౌకికవాద భావసారూప్యమున్న పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. మరి ఎంతవరకు పొత్తు కుదురుతుందో తెలియాలంటే వెయిట్ చూడాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu