షారుక్ ఖాన్ కు ఎండోస్కొపీ



'హ్యాపీ న్యూ ఇయర్' చిత్ర షూటింగ్ లో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ త్వరలోనే ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోనున్నారు. ఐఏఏ లీడర్ షిప్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న షారుక్ మాట్లాడుతూ.. ‘‘గాయం నుంచి కోలుకున్నాను. ప్రస్తుతం సర్జరీ అవసరం లేదు. కాని ఎండోస్కోపీ మాత్రం అవసరమైంది’’ అని తెలిపారు. జనవరి 23 తేదిన 'హ్యాపీ న్యూ ఇయర్' షూటింగ్ లో చోటు జరిగిన ప్రమాదంలో షారుక్ భుజానికి ఫ్రాక్చర్ అయింది. దాంతో రెండు, మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని.. రిస్క్ తో కూడిన ఫైట్స్ చేయకూడదని షారుక్ కు డాక్టర్లు సూచించారు. మరో నెల రోజుల విశ్రాంతి తర్వాత షూటింగ్ లో పాల్గొంటానని షారుక్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu