తెలంగాణావాదంలో లుకలుకలు?
posted on Oct 3, 2012 11:49AM
.png)
.png)
ఆది నుంచి ప్రత్యేకతెలంగాణా వాదం ఓ పెద్ద విభేదాలకు తావిస్తూనే ఉంది. తెలుగుమాట్లాడే వారందరిదీ ఒకే జాతి అని జాతీయవాదాన్ని తోసిపుచ్చటానికి ఈ వాదాన్ని సృష్టించారన్నది జగమెరిగిన సత్యం. ఎన్నో రంగులు అద్ది కొత్తపోకడలు తీసుకువచ్చి సృష్టించిన ఈ తెలంగాణావాదం విభజించటానికి ఆజ్యం పోస్తోంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలా సమైక్యతాభావానికి ఇది గొడ్డలిపెట్టుగా మారింది. ప్రాంతీయ విభేదాలతో ఒకరిని ఒకరు తీవ్రంగా ద్వేషించుకునే వాతావరణం నెలకొంది. ఒక్క తెలంగాణా మినహాయించి యావత్తు ఆంధ్రప్రదేశ్ ఒకే తాటిపై ఉంది. కానీ, తెలంగాణావాదులు మాత్రం తమలో తాము గొడవపడుతూ, మిగిలిన యావత్తు రాష్ట్రంతో గొడవపడుతున్నారు. చెడపకురా చెడేవు అన్న సామెతకు తెలంగాణావాదులను నిదర్శనంగా చూపవచ్చు. పాలకుండలో విషపుచుక్కలా తెలంగాణావాదాన్ని యావత్తు రాష్ట్రానికి ఆపాదించేందుకు ఆ ప్రాంతీయులు సృష్టించిన రగడ యావత్తు రాష్ట్ర అభివృద్థిని దెబ్బతీస్తోంది. ఇప్పటి దాకా తెలంగాణేతరులు పెట్టిన పెట్టుబడులు, కట్టిన ఫ్యాక్టరీలు, తీసుకొచ్చిన సంస్కృతి తెలంగాణా ప్రాంతీయులు అలవర్చుకున్నారు. ఎప్పుడూ కరువుకాటకాలుతోనూ, రాళ్ల భూమిని సాగు చేయలేక వలసకూలీలుగా మారిన ప్రజలతోనూ తెలంగాణా నిత్యం ఇతర ప్రాంతాలపై ఆధారపడే ఉంది. తెలంగాణావారిని రానీయకూడదని ఆంధ్రులు కూడా నిజాయితీ తీర్మానం చేస్తే ఆ ప్రాంతానికి బతకటానికి కనీసం కూసింత తిండిగింజలు జాన్తానై అంటాయి. ఈ విషయం తెలిసినా ఆ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బతికేందుకు తెలంగాణారాష్ట్ర సమితి, తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ ఇంకా మరికొన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి. ఏకంగా బిజెపి అయితే తెలంగాణాలో పట్టుకోసం ప్రయత్నిస్తోంది. అది టిఆర్‌ఎస్‌ను చావుదెబ్బ కొట్టయినా(తొక్కేసయినా) సరే పైకి రావాలని కోరుకుంటోంది. ఆ దిశగా బిజెపి అడుగులు కదుపుతూ ఉంటే మిగిలిన తెలంగాణావాద పార్టీలు తమకో జాతీయపార్టీ అండ దొరికిందని చంకలు గుద్దుకున్నాయి. అసలు వాస్తవాన్ని తెలుసుకున్న తెలంగాణారాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అధినేత కేసిఆర్ ఢల్లీలో తిష్టవేశారు. ఈలోపు జెఎసి ఛైర్మను, ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణామార్చ్ రాజధాని వరకూ నిర్వహించారు. ఆయన్ని ఒక సందర్భంలో ప్రశ్నిస్తే టిఆర్‌ఎస్ లేకపోతే జెఎసి కూడా లేదన్నారు. అటువంటి కోదండరామ్ ఇప్పుడు నేరుగా టిఆర్‌ఎస్‌ను చీల్చి చెండాడేద్దామనుకున్నారు. కానీ, ఆ పప్పులేం ఉడకలేదు. తాజాగా విమలక్క చేసిన వ్యాఖ్యలు అందరినీ రెబ్బగొడుతున్నాయి. ఇలా ప్రారంభమైన టిఆర్‌ఎస్ తమతో పాటు కలిసి పని చేయటానికి మిగిలిన పార్టీలు ముందుకు రావాలని కోరకుంటున్నాయి. తెలంగాణాజాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులు టిఆర్‌ఎస్‌పై ధ్వజమెతుతున్నాయి.