తెలంగాణలో స్కూల్స్ క్లోజ్ 

తెలంగాణలో విద్యా సంస్థలు మూత పడ్డాయి. కరోనా విజృంభణతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య కళాశాలలు మినహా మిగతా అన్ని రకాల పాఠశాలలు ,కళాశాలలను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. విద్యాసంస్థలు మూసి వేయాలని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు సబితా. విద్యార్థులు ,తల్లిదండ్రుల  క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసి వేస్తున్నామని తెలిపారు. పొరుగు రాష్ట్రాలలో విద్యాసంస్థలు మూసివేసినందున.. తెలంగాణ లో కూడా విద్యాసంస్థలను క్లోజ్ చేయాలని నిర్ణయించామన్నారు. ఆన్ లైన్ లో తరగతులు కొనసాగుతాయన్నారు సబితా ఇంద్రారెడ్డి. 

తెలంగాణలో ప్రస్తుతం కరోనా పంజా విసురుతోంది. 15 రోజుల నుంచి రోజుకు 3 వందలకుపైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఏకంగా 4 వందలు క్రాస్ అయ్యాయి. అందులో దాదాపు సగానికిపైగా కేసులు గురుకులాల్లలోనే వచ్చాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 700 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. పరిస్థితి చేజారిపోకుండా ఉండాలంటే పదో తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను మూసివేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వైరస్ వ్యాప్తికి ఇవి వాహకాలుగా మారుతున్నాయని భావిస్తున్న వైద్యాధికారులు ఈ సూచన చేశారు. నిజానికి పిల్లల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండడంతో వారికి వైరస్ సంక్రమించినా లక్షణాలు బయటపడవు. దీంతో వారి నుంచి కుటుంబ సభ్యులకు, వారి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల మూసివేతే సరైన పరిష్కారమని చెప్పారు. 

సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. విద్యాసంస్థల మూసివేతతో పాటు లాక్ డౌన్ అంశంపై చర్చించారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu