తండ్రి లై*గిక వేధింపులు.. కాల్చి చంపిన కూతురు... 

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వసంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని.. అని ఎన్ని పాటలు రాసిన, ఎన్ని శిక్షలు వేసిన ఎన్ని ప్రభుత్వాలు మరీనా..  మారాడు లోకం మారాడు కాలం. దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోనీ.. మారదు లోకం.. మారదు కాలం.. అదే నిజం అదే కొందరి దుర్మగుల నైజం.. కసాయి కోతులకు తెగిపడుతున్న మహిళా కుత్తికెలు ఎన్నో.. మగాడి చీకటి చాటున వెలుగు చూడని మగువల మానాలు ఎన్నో.. అన్న, తమ్ముడు, బావ, మరిది, మామ, తాత, పేరు పేగు  బంధం ఏదైతేనేమి అందరూ మగాలే.. వారికీ కావాల్సిందే మగువలే.. మహిళపై నిత్యం దాడులు భారత దేశాన్ని మహిళా ఏడుపు దేశం గా చెప్పాలి. 
 
ఆమె తల్లి లేదు. కన్నాతండ్రి దగ్గరే పెరిగింది. కానీ తండ్రి కూతురిపై యమా కింకరుడయ్యాడు. నిత్యం వేధింపులకు గురవుతూ ఉండేది. మేడలో తాళి పడితే తండ్రి బాధ తప్పుతుందనుకుంది. మేడలో తాళి మరింత బరువుగా మారింది. పెళ్లి జీవితం విడాకులు తీసుకుని యూటర్న్ తీసుకుని. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చింది. దాంతో మళ్లీ ఆ కసాయి తండ్రి కూతురిపై వేధింపులు స్టార్ట్ చేశాడు. ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేశాడు. దీంతో ఆమె ఓ దారుణ నిర్ణయం తీసుకుంది. కన్నతండ్రిని సజీవ దహనం చేయాలని డిసైడ్ అయింది. అందుకు పథకం వేసింది.  

ఓ సాయంత్రం తన తండ్రిని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లింది. ఫుల్ గా మద్యం తాగించింది. తినిపించి.  ఆ తర్వాత హుగ్లీ నది ఒడ్డుకు తీసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న ఆ తండ్రి బెంచిపై కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ఆ మహిళ తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను అతనిపై పోసి నిప్పంటించింది. కోల్‌కతాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలు సంచలనంగా మారాయి. పోలీసుల విచారణలో నిందితురాలు తన తండ్రి అకృత్యాలను వెల్లడించింది. చిన్న వయసు నుంచి తండ్రి పెడుతున్న బాధలు తట్టుకోలేక అతడిని చంపేసినట్టు అంగీకరించింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu