కొత్త వాయింపుడు మొదలెట్టిన ఎస్‌బీఐ
posted on Jul 11, 2017 3:41PM
.jpg)
పెద్ద నోట్లు రద్దు తర్వాత నుంచి వినియోగదారుల నుంచి నిబంధనల పేరిట కొత్త కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి బ్యాంకులు. ప్రైవేట్ బ్యాంకులే కాదు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదు బదిలీ సేవలపై ఛార్జీలను సవరించింది. నగదు బదిలీల్లో కీలకమైన ఐఎంపీఎస్ సర్వీస్ ఛార్జీలను సవరిస్తూ కొత్త రేట్లను ట్విట్టర్‌లో ప్రకటించింది. ఐఎంపీఎస్ కింద రూ.1000 వరకు ఇతర ఖాతాలకు పంపిస్తే ఎలాంటి రుసుములు ఉండవు..రూ.1000 నుంచి రూ.లక్ష వరకు రూ.5ను రుసుముగా వసూలు చేస్తారు. అలాగే రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు బదిలీలపై రూ.15ను ఛార్జీగా వసూలు చేస్తారు. ఈ రుసుములకు జీఎస్టీ అదనమని ఎస్‌బీఐ ప్రతినిధులు తెలిపారు.