ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీజీ మనవడు

త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున అభ్యర్ధిగా గాంధీజీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరును విపక్ష పార్టీలు ప్రకటించాయి. తమ ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు 18 విపక్ష పార్టీలు ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ హల్‌లో సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా గోపాలకృష్ణ గాంధీపై చర్చించాయి..తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనకు గతంలోనే పూర్తి మద్ధతునిచ్చారు. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో మొదట గోపాలకృష్ణనే అభ్యర్థిగా తీసుకొచ్చారు. కానీ చివరికి మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. ఆగష్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాల లెక్కింపు చేపట్టనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu