ప్రభుత్వాధికారి మాట వినలేదని చేపతో కొట్టాడు..
posted on Jul 11, 2017 3:59PM
.jpg)
ప్రాంతం ఏదైనా కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వోద్యోగులు అంటే చులకనగా తయారైంది చాలా మంది ప్రజాప్రతినిధులకి..తాజాగా మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే గత గురువారం మత్స్యకారుల సమస్యల గురించి ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారిని అడిగేందుకు వెళ్లారు. ఆ అధికారితో మాట్లాడుతూ కోపాన్ని ఆపుకోలేక అక్కడే ఉన్న ఓ చేపను ఆయనపై విసిరి కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో వైరల్ అవ్వడంతో పోలీసులు రాణేను అరెస్ట్ చేశారు..అంతేకాకుండా ఆ సమయంలో అక్కడే ఉన్న మరో 23 మందిని అరెస్ట్ చేసి కొంకణ్ కోర్టులో హాజరుపరిచారు. విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ అధికారిపై కుట్రపూరితంగా దాడికి పాల్పడటమే కాకుండా అల్లర్లకు పాల్పడటం, నేరపూరిత ఆలోచనతో దాడి చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
