సత్తిబాబు మాస్టర్ ప్లాన్!.. జనసేనలోకి బొత్స లక్ష్మణ్

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ ముందు జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి మనుగడ లేదన్న గ్రహింపునకు వచ్చేశారా? పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చానా.. వైసీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదని భయపడుతున్నారా అంటే రాజకీయవర్గాల నుంచి ఔనన్న సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. అయితే నిన్న గాక మొన్న వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అయిన తాను పార్టీ మారితే బాగుండదని భావించి ముందుగా తన అనుయాయులను, బంధుగణాన్ని వైసీపీని వీడమని సూచిస్తున్నారని, అందులో బాగంగానే వైసీపీ నుంచి ముందుగా తన సోదరుడు బొత్స లక్ష్మణ్ ను గట్టు దాటించేయాని నిర్ణయించుకున్నారు. త్వరలో బొత్స లక్ష్మణ్ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరనున్నారు.

బొత్స సత్యనారాయణ పాలిటిక్స్ అంటేనే ఫ్యామిలీ ప్యాకేజ్.. వైఎస్ హయాంలో జిల్లాలో దాదాపు అన్ని పదవుల్లోనూ ఆయన బంధుజనమే ఉన్నారు. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో గట్టి పట్టున్న నేత అనడంలో సందేహం లేదు. ఆయనతో పాటు భార్య, సోదరులు, బంధువులు కూడా ఎంపీగా, ఎమ్మెల్యేలుగా జిల్లా నుంచి విజయం సాధించిన వారే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచే బొత్స సత్యనారాణ తిరుగులేని నేతగా ఉన్నారు. జిల్లాలో  ఆయన తిరుగులేని పట్టు సాధించారు. 2014, 2024 ఎన్నికలలో వినా  జిల్లాలో ఆయన కుటుంబానిదే ఆధిపత్యం. వైఎస్ మరణం తరువాత కొంత కాలం జగన్ తో కలిసి నడిచిన బొత్స ఆ తరువాత జగన్ సొంతంగా వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత కూడా బొత్స కాంగ్రెస్ లోనే కొనసాగారు.

2014 ఎన్నికల తరువాత ఎప్పుడో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. అప్పుడు జగన్ తొలి క్యాబినెట్ లో బొత్స ఉన్నారు. ఆ తరువాత పునర్వ్యవస్థీకరణలోనూ బొత్స తన మంత్రి పదవిని కాపాడుకోగలిగారు. అయితే అప్పుడు అంటే జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బొత్సకు కోరుకున్న మంత్రి పదవి అయితే దక్కలేదు. ఆ అసంతృప్తి అప్పట్లో స్పష్టంగా కనిపించింది. విద్యాశాఖ అధికారులెవరూ జగన్ ను లెక్క చేయని పరిస్థితి ఉండేది. అప్పట్లోనే తెలుగు వన్  జగన్ కేబినెట్ లో సీనియర్ల చిటపటలు అన్న శీర్షికతో బొత్స అసంతృప్తిపై వార్తాకథనం ప్రచురించింది. 

ఇది కూడా చదవండి .. జగన్ కాబినెట్లో సీనియర్ల చిటపటలు 

ఇక గతంలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా బొత్సలో పేరుకున్న అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అయినా సంయమనం పాటించి పార్టీలో కొనసాగారు. సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన గత ప్రభుత్వ ముఖ్య సలహాదారుతో కలిసి వైసీపీ పాపాలన్నిటిలోనూ సింహభాగం పంచుకున్నారు.  సరే వైసీపీ ఘోర పరాజయం తరువాత కూడా వైసీపీలోనే  కొనసాగుతున్నారు. పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనా ఎమ్మెల్సీ సాధించడంలో బొత్స తన రాజకీయ చాణక్యాన్ని చాటుకున్నారు. అయినా వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయం, గతంలో అంటే తనకు అప్రాధాన్య శాఖ ఇచ్చి జగన్ అవమానించారన్న కోపం మాత్రం అలాగే ఉండిపోయినట్లున్నాయి. అందుకే అదును చూసి పావులు కదుపుతున్నారు. ముందుగా తన సోదరుడిని జనసేనలోకి పంపుతున్నారు. ఆ తరువాత వరుసగా ఆయన ఫ్యామిలీ ప్యాకేజీని జనసేనకు పరిచయం చేస్తారు. బొత్స వ్యవహారశైలి తెలిసిన అందరూ ఇదే అంటున్నారు.

ఇక బొత్స కుటుంబంలో బొత్స మాటే ఫైనల్ అందుకే బొత్స చెప్పగానే మారు మాట్లాడకుండా బొత్స లక్ష్మణ్ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. ఆయన వెంట.. ఒకరి తరువాత ఒకరుగా బొత్స సహా ఆయన బంధుగణం అంతా జిల్లాలో వైసీపీ జెండాను పీకేసి జనసేనకు జై కొట్టడానికి ఎంతో సమయం పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో  బొత్స కుటుంబం మొత్తం కొట్టుకుపోయింది. బొత్స ఒక్కరే  ఎమ్మెల్సీ  అయ్యారు. అయితే అధికారం లేని పార్టీ ఎమ్మెల్సీగా బొత్స బావుకునేదేమీ ఉండదు. అందుకే  తన దారి తాను చూసుకోవడానికి, తనతో పాటు తన బంధుగణాన్నీ రాజకీయ సమాధి నుంచి కాపాడేందుకు జనసేనకు చేరువ అవుతున్నారని చెబుతున్నారు.