ఆ విషయంలో తెలంగాణ వెనుకబాటు!

ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ‌, వార్డు, మండ‌ల, ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా స్థాయి క‌మిటీల ఏర్పాటుకు విధివిధినాలు వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  ఇందిర‌మ్మ ఇళ్లపై నిర్వహించిన సమీక్షలో రేవంత్  ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న నుంచి ఇత‌ర రాష్ట్రాలు ల‌క్ష‌ల సంఖ్య‌లో గృహాలు మంజూరు చేయించుకుంటే ఈ విష‌యంలో తెలంగాణ వెనుక‌బ‌డి ఉంద‌న్నారు.  ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న నుంచి ఇత‌ర రాష్ట్రాలు ల‌క్ష‌ల సంఖ్య‌లో గృహాలు మంజూరు చేయించుకుంటే ఈ విష‌యంలో తెలంగాణ వెనుక‌బ‌డి ఉంద‌న్నారు.