సత్యసాయి ట్రస్ట్ అత్యవసర భేటీ
posted on May 31, 2011 11:50AM
పుట్ట
పర్తి : సత్యసాయి ట్రస్ట్ సభ్యులు మంగళవారం శాంతిభవన్‌లో అత్యవసరంగా సమావేశం అయ్యారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా యజుర్వేద మందిరం తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోని శాంతి భవన్‌లో సత్యసాయిబాబా సోదరుడి తనయుడు రత్నాకర్, శ్రీనివాసన్, ఎస్వీ గిరి, చక్రవర్తి మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. యజుర్వేద మందిరం తెరిచే విషయంపై వారు రహస్యంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. యజుర్వేద మందిరాన్ని ఎప్పుడు తెరవాలనే విషయంపై చర్చించి నిర్ణయించుకొని ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశ్యంతో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.