తగ్గని అఖిలేశ్... ములాయం నిర్ణయానికి వ్యతిరేకంగా...
posted on Jan 5, 2017 11:28AM

ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో రాజకీయ విబేధాలు గతం నుండే ఉన్నాయి. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఈ విబేధాలు మరీ ఎక్కువవుతున్నాయి. పార్టీలో రెండు చీలకలు ఏర్పడినంత పనైంది. అయితే ఇప్పుడు మరో చర్యకు అఖిలేశ్ పాల్పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ గుర్తుపై తండ్రి కొడుకుల మధ్య వార్ నడుస్తుండగా.. ఇప్పుడు దానికి తోడు అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా వ్యవహరిస్తున్నాడు సీఎం అఖిలేశ్. ములాయం అధ్యర్యంలో శివపాల్ యాదవ్ నాలుగు జిల్లాల పార్టీ అధ్యక్షులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారిని తిరిగి పార్టీలోకి తీసుకుంటున్నట్టు అఖిలేశ్ ప్రకటించారు. ఈ మేరకు అఖిలేష్ నియమించిన పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పేరిట మీడియాకు ప్రకటన వెలువడింది. తమ జాతీయ అధ్యక్షుడి సూచనల మేరకు వీరిపై సస్పెన్షన్ తొలగించినట్టు నరేష్ వెల్లడించారు. మరి అఖిలేశ్ తీసుకున్న ఈ నిర్ణయంతో తండ్రి, కొడుకుల మధ్య వివాదాలు ఇంకెంత ముదురుతాయో.. దీనికి ములాయం ఎలా స్పందిస్తారో చూడాలి.