పోసాని కేసులో సజ్జలకు బెయిల్ మంజూరు
posted on Mar 28, 2025 11:20AM
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిలను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో తండ్రి కొడుకులు ఎపి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో వీరికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వైకాపా నేతలకు బెయిల్ వచ్చిన విషయం స్వంత పార్టీ ఒక ప్రకటన చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. వైకాపా మీడియా సంస్థలో కూడా తండ్రి కొడుకులకు బెయిల్ వచ్చిన వార్త ప్రాధాన్యత చోటు చేసుకోకపోవడం గమనార్హం. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటుడు పోసాని కృష్ణ మురళి తన నేరాన్ని అంగీకరించడంతో సజ్జల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే తాను కూటమి నేతలపై వ్యాఖ్యలు చేసినట్టు పోసాని వాంగ్యూలం ఇచ్చారు.
నటుడు , రచయిత, దర్శకుడైన పోసాని కృష్ణ మురళి చివరకు సజ్జల స్క్రిప్ట్ ప్రకారం అనుచిత వ్యాఖ్యలు చేసి జైలు పాలు కావాల్సి వచ్చింది. కోర్టులో ఆయన న్యాయమూర్తి ఎదుట భోరున విలపించడం ఎవరూ ఊహించలేకపోయారు.