ఈజిప్టులో ఘోర విమాన ప్రమాదం

 

ఈజిప్టులో ఘోర విమాన ప్రమాదం జరిగింది, ఈజిప్టు నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కి బయల్దేరిన ఎయిర్ బస్ 321 విమానం టేకాఫైన 23 నిమిషాల్లోనే సినాయ్ ద్వీపకల్పంలో కుప్పకూలింది, విమాన శకలాల నుంచి ఆర్తనాదాలు వినిపించడంతో ఈజిప్టు అధికారులు రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు, అయితే అప్పటికే కొంత ఆలస్యం జరగడంతో విమానంలో ప్రయాణిస్తున్న 217మంది ప్రమాణికులతోపాటు ఏడుగురు సిబ్బంది చనిపోయారని ఈజిప్టు అధికారులు ప్రకటించారు, అయితే ప్రయాణికుల్లో ఎక్కువగా మంది రష్యన్లే కావడంతో రష్యా ప్రభుత్వం రేపు సంతాపదినంగా ప్రకటించింది.