ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

 

అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని బూచేపల్లి బస్టాప్ దగ్గర బుధవారం తెల్లవారుఝామున ఒక ఆటోని లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మృతులు పుట్టపర్తి ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందినవారు. వీరందరూ కూలీ పనుల కోసం కర్ణాకలోని బాగేపల్లి మార్కెట్‌కి వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ఆటోను బెంగుళూరు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఢీకొంది.