‘అభినందన’, ‘నీరాజనం’ దర్శకుడి కన్నుమూత
posted on Oct 22, 2014 10:24AM
‘అభినందన’, ‘నీరాజనం’ చిత్రాల దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్‌కుమార్ (72) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం నాడు ఆయన చెన్నైలో మరణించారు. అశోక్‌కుమార్ అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అశోక్‌కుమార్ దర్శకత్వం వహించిన ‘అభినందన’ చిత్రం మ్యూజికల్ హిట్ అయింది. అలాగే మరో చిత్రం ‘నీరాజనం’ సినిమా విజయం సాధించకపోయినప్పటికీ, ఆ సినిమా సంగీతం పెద్ద హిట్ అయింది. ఆయన దర్శకత్వం వహించిన ‘మంచుకురిసే వేళలో’ అనే మరో సినిమా నిర్మాణం పూర్తి కాకముందే ఆగిపోయింది. అశోక్ కుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.