మరో బాణాసంచా దుర్ఘటన.. ఇద్దరి మృతి

 

నల్గొండ జిల్లా భువనగిరి పట్టణంలో మగళవారం రాత్రి ఒక వ్యాపారి ఇంట్లో నిల్వ వుంచిన టపాసులు పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లు నేలమట్టమైంది. భువనగిరిలోని ఆర్ బి నగర్‌లో కిరాణా దుకాణం నిర్వహించే శ్రీనివాస్ దీపావళికి విక్రయించడం కోసం భారీ సంఖ్యలో మందుగుండు సామాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అయితే మంగళవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఛార్జింగ్ లైట్ నుంచి వెలువడిన నిప్పురవ్వలే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.