పవన్, చిరుల విభేదాలు బయటపడ్డాయి!
posted on Feb 27, 2014 4:20PM

మెగా కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. చాలా కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవి మధ్య విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం కానున్న చిత్ర ప్రారంబోత్సవం సందర్బంగా ఈ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఈ చిత్రం ప్రారంబోత్సవానికి హాజరైన పవన్ కళ్యాణ్, చిరంజీవి మాట్లాడుకోకుండా ఎడమొహం, పెడమొహంగా వుండడం ఈ వార్తలకు ఇంకా బలాన్ని చేకూరుస్తున్నాయి. వరుణ్ తేజకి స్వయంగా బాబాయి అయిన పవన్ ప్రారంబోత్సవానికి వచ్చినా అయిష్టంగానె దూరంగా వుండి మధ్యలోనే వెళ్ళిపోవడం మెగా అభిమానులకు షాక్ కి గురిచేసింది. చాలా రోజుల తరువాత మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఓకే వేదికపైన చూద్దామని ఆశగా వచ్చిన అభిమానులకు పవన్ నిష్క్రమణ నిరాశనే మిగిల్చింది.