హీరోయిన్ భూమికకు బాబు

 

దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించిన ప్రముఖ కథానాయిక భూమిక 2007లో యోగా గురు భరత్ ఠాకూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే భూమిక ఇటీవలే ఓ బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భూమిక స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. "మాకు ఆ దేవుడు బాబును బహుమతిగా ఇచ్చాడు. ఆ సందర్భంలో భరత్, నేను ఉద్వేగానికి లోనయ్యము" అంటూ ట్వీట్ చేసింది. పెళ్ళయ్యాక కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న "లడ్డుబాబు" చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu